తీన్మార్ మల్లన్నను కలిసిన  గీత కార్మిక సంఘం 

తీన్మార్ మల్లన్నను కలిసిన  గీత కార్మిక సంఘం 

విశ్వంభర, రామన్నపేట: తెలంగాణ రాష్ట్రంలోని కల్లు గీత కార్మికులు ప్రమాదవశాత్తు చెట్ల మీది నుండి కిందపడి చనిపోయిన కార్మికుల కుటుంబాలకు రావాల్సిన బకాయిలను చెల్లించేలా తెలంగాణ శాసన మండలిలో ప్రస్తావించి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని, ఎక్సైజ్ శాఖా మంత్రి దృష్టికి కూడా తీసుకు వెళ్లాలని కోరుతూ యాదాద్రి భువనగిరి జిల్లా సర్దార్ సర్వాయి పాపన్న గీతకార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు, యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలానికి చెందిన కప్పల (పరిటాల) రవి సర్దార్ సర్వాయి పాపన్న గీతకార్మిక సంఘం తరఫున ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ను కలిసి వారికి లెటర్ ఇవ్వడం జరిగింది. సేఫ్టీ మోకుల గురించి కూడా ప్రస్తావించాలని కోరడం జరిగింది. ఈనెల 16న జరిగే శాసనమండలి సమావేశాలలో కల్లు గీత కార్మికుల సమస్యల మీద, పెండింగ్లో ఉన్న వారి బకాయిలను తక్షణమే విడుదల అయ్యేలాగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని వారిని కోరడం జరిగింది.

Tags: