మాస్టర్ యువర్ మైండ్ పుస్తకావిష్కరణ

మాస్టర్ యువర్ మైండ్ పుస్తకావిష్కరణ

 విశ్వంభర,పెద్ద శంకరంపేట:  పెద్ద శంకరంపేట మండలం  ప్రభుత్వ ఉపాధ్యాయుడు , రచయిత భృంగి ప్రసన్నకుమార్ రచించిన మాస్టర్ యువర్ మైండ్ పుస్తకావిష్కరణ మంగళవారం మెదక్ జిల్లా కలెక్టర్ ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ,  మనిషి ప్రవర్తనలో ప్రత్యేకతలను సరిగ్గా విశ్లేషించడం కష్టమైన పని అన్నారు. మనం పనిచేసి అలసిపోతామని ఆనుకుంటాం అది నిజమే కానీ పనివల్ల మాత్రమే కాకుండా ఆలోచనల వల్ల అలసిపోతామని పేర్కొన్నారు. పరీక్షలను ఎదుర్కొనే విద్యార్థులు, జీవన వైవాహిక స్థిరత్వాన్ని ఎదుర్కొనే యువతకు కుటుంబం గురించి ఆలోచించి ఆందోళన పడే పెద్దలకు ఈ పుస్తకం మార్గదర్శిగా ఉపయోగపడుతుందని కొనియాడారు. రచయిత మరిన్ని పుస్తకాలు రాయాలని కలెక్టర్ గారు ఆకాక్షించారు. కార్యక్రమంలో మెదక్ జిల్లా డి ఈ ఓ  రాజు  ఏఎంసి  సుదర్శన మూర్తిగా సీఎంఓ  రాజు ఎస్ ఓ  నవీన్ గారు, కరుణాకర్  తదితరులు పాల్గొన్నారు.

🕒 10 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/master-your-mind-book-launch/article-16362

Tags: