ఉచిత సమ్మర్ క్యాంపును వినియోగించుకోవాలి

ఉచిత సమ్మర్ క్యాంపును వినియోగించుకోవాలి

విశ్వంభర,  చింతపల్లి: చింతపల్లి ఆదర్శ పాఠశాలలో (మోడల్ స్కూల్) వేసవి శిబిరం (సమ్మర్ క్యాంప్) నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ అమ్తుల్ జమాల్ అస్రా ఒక ప్రకటనలో తెలిపారు. చింతపల్లి మండల కేంద్రంలో ఆదర్శ పాఠశాలలో ఈనెల 11 నుంచి 25 వరకు వేసవి శిబిరం ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆరవ తరగతి నుండి తొమ్మిదవ తరగతి చదివే విద్యార్థులకు వేసవి శిక్షణ  నిర్వహిస్తామని, శిక్షణలో భాగంగా విద్యార్థులకు సంగీతం, క్రీడలు, డ్రాయింగ్ నృత్య కృత్యాలను నేర్పుతున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న మండలంలోని అన్ని పాఠశాలల విద్యార్థులు ఈ సమ్మర్ క్యాంప్ లో చేయవచ్చని ఆమె కోరారు. ఈ అవకాశాన్ని మండల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ప్రతి రోజు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ యొక్క ఉచిత సమ్మర్ క్యాంప్ ఉంటుందని ఆమె అన్నారు.

🕒 09 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/avail-the-free-summer-camp/article-15136

Tags: