సమాజ హితం కోరే వ్యక్తి రాజగోపాల్ రెడ్డి .
-జిల్లా నాయకులు దోనూరి జైపాల్ రెడ్డి
On
విశ్వంభర,సంస్ధాన్ నారాయణపురం :- మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వైన్ షాపుల నిర్వహణపై తీసుకున్న సాహసోపేతమైన, సమాజహితమైన నిర్ణయాలు రాష్ట్ర యావత్తు ప్రజానీకం హర్షిస్తుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు దోనూరు జైపాల్ రెడ్డి ఒక పత్రిక ప్రకటన ద్వారా తెలిపారు. సాయంత్రం 4 గంటల నుండి 9 గంటల వరకు మాత్రమే వైన్ షాపులు అనుమతించడం,సిట్టింగ్ పర్మిషన్ రద్దు చేయడం,బెల్ట్ షాపులను పూర్తిగా నిర్మూలించడం, వైన్ షాపులు ఊరుకి బయట ఉండాలనే ఆదేశం ఇవ్వడం ఇవన్నీ మునుగోడు ప్రజల బాగు కొరకు తీసుకున్న ప్రజాహిత నిర్ణయాలు అని తెలియజేశారు. మన గ్రామాల్లో గమనిస్తే, మధ్యతరగతి కుటుంబాలు,రోజు వారి కూలీలు,పేదలు,ముఖ్యంగా యువత ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకొని వారి కుటుంబాల మహిళల విన్నపాలను పరిగణనలోకి తీసుకొని,మార్పు మన నియోజకవర్గం నుంచే ప్రారంభమవ్వాలనే ఆలోచనతో ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం నిజంగా ప్రేరణాత్మకమన్నారు.బెల్ట్ షాపుల నిర్మూలనతో గ్రామాల్లో ప్రశాంతత పెరుగుతుంది.కుటుంబాల్లో ఆనందం నెలకొంటుంది. సమాజంలో ఆరోగ్యకరమైన మార్పు మొదలవుతుందని,ఇకపై పని చేసుకునే వారు మద్యం బానిసలుగా కాకుండా, సాయంత్రం ఇంట్లో పరిమితంగా తాగి విశ్రాంతి తీసుకునే అలవాటు ఏర్పడుతుంది.దీనివల్ల ప్రమాదాలు తగ్గి, కుటుంబాలు బాగుపడతాయి, సమాజం బలపడుతుంది. మన సమాజాన్ని, మన భవిష్యత్తును మనమే నిర్మిద్దాం.ప్రజా ప్రయోజనాన్ని కాపాడే ఈ నిర్ణయానికి మనమందరం మద్దతు తెలపడం మనందరి కర్తవ్యం.



