కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ 

కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ 

విశ్వంబర, మహబూబాబాద్ జిల్లా : జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో  మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూక్య మురళి నాయక్ చేతుల మీదుగా కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ జరిగింది . ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులను 91 మంది లబ్ధిదారులకు  రూ.91 లక్షల  పదివేల 556  రూపాయల విలువచేసే  కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు . ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ,  పేద కుటుంబాల్లో ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఈ పథకం ఎంతో ఆసరాగా నిలుస్తోందని, ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు . ఈ  కార్యక్రమంలో  మహబూబాబాద్ తాసిల్దార్  చంద్ర రాజేశ్వరరావు , సంబంధిత అధికారులు , మహబూబాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్  గుగులోత్ జ్యోతి రమేష్ నాయక్, వార్డ్ కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, మహబూబాబాద్  నియోజకవర్గ ప్రజలు , పట్టణ నాయకులు,ప్రజా ప్రతినిధులు,  మాజీ ప్రజా ప్రతినిధులు,  కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు 

Tags: