రోగనిరోధకతపై రేస్ ఫర్ 7 అవేర్నెస్ రన్
విశ్వంభర, బషీర్ బాగ్: నోవో నార్డిస్క్ ఇండియా సహకారంతో ఆర్గనైజేషన్ ఫర్ రేర్ డిసీజెస్ ఇండియా (ఓఆర్డీఐ) అరుదైన వ్యాధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత్ లోని 21 నగరాల్లో రేస్ ఫర్ 7' అవేర్ నెన్ రన్ 10వ ఎడిషన్ ను విజయవంతంగా నిర్వహించింది. అరుదైన వ్యాధులతో ఉన్నవారు, సంరక్షకులు, హెల్త్ కేర్ నిపుణులు, పాలసీమేకర్లు అందరూ కలిసి అరుదైన వ్యాధులతో నివసించే వ్యక్తులకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ అందించడం కోసం ముందడుగు వేసిన ఈ కార్యక్రమానికి అపూర్వ స్పందన లభించింది. భారతదేశంలో అరుదైన వ్యాధులు రాకుండా నివారణ చికిత్స ప్రత్యామ్నాయాల అవసరాన్ని నొక్కి చెబుతూ, విక్రాంత్ శ్రోత్రియా నోవో నార్డిస్క్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడుతూ, భారతదేశంలో ప్రబలం గా ఉన్న అరుదైన రక్తస్రావం వ్యాధి, ఇతర అరుదైన వ్యాధులను నిరంతర అవగాహన, ప్రారంభంలోనే తొందరగా గుర్తించి, సమర్థవంతమైన చికిత్స ద్వారా మాత్రమే ఎదుర్కోవచ్చన్నారు. హిమోఫిలియా కలిగిన వ్యక్తుల జీవన నాణ్యతను మెరుగుపరచడానికి ప్రాఫిలాక్సిస్ (రోగనిరోధకత)కు సంబంధించిన చికిత్స అవసరం ఉన్నదన్నారు. దేశంలో అరుదైన వ్యాధుల బారిన పడిన వారికి మెరుగైన ఆరోగ్య సంరక్షణ పరిష్కారాల గురించి వారి కార్యక్రమాలలో ముఖ్యమైన సంభాషణలకు అవకాశం కల్పిస్తున్న ఓఆర్డీఐ కి మద్దతు ఇవ్వడం మాకు గర్వంగా ఉందన్నారు.



