నేటి నుండి సమ్మర్ క్రికెట్ కోచింగ్ క్యాంప్
విశ్వంభర, మహబూబాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెచ్సీఏ ఆధ్వర్యంలో వరంగల్ డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్ డబ్ల్యూ డి సి ఏ సహకారంతో మే 8 నుండి సమ్మర్ క్రికెట్ కోచింగ్ క్యాంప్ ప్రారంభం అవుతుందని మహబూబాబాద్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు బి అజయ్ సారధి రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. క్రీడాకారులు సమ్మర్ క్రికెట్ కోచింగ్ లో పాల్గొని తమ యొక్క క్రీడా ప్రతిభను పెంచుకోవాలన్నారు. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం క్యాంప్లో క్రికెట్కు కావాల్సిన మెలుకువలు నేర్పుతున్నట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా క్యాంపు ద్వారా క్రికెట్ మెలకువలు నేర్చుకొని భవిష్యత్తులో ఐపీఎల్,రంజి జాతీయ జట్టుకు ఆడే విధంగా క్రీడాకారులు తమ ప్రతిభను మెరుగుపరచుకోవాల్సిందిగా అజయ్ సారధి రెడ్డి కోరారు . ఈ సందర్భంగా అసోసియేషన్ చీఫ్ కోచ్ మెతుకు కుమార్, బి సాద్విత్ రెడ్డి, సహాయకులు సంతోష్, వినయ్లను సంప్రదించవలసిందిగా విజ్ఞప్తి చేశారు.