వర్షపు నీరుతో ఇబ్బందులు - సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి - పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే
విశ్వంభర, ఎల్బీనగర్ : ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వనస్థలిపురం డివిజన్ పరిధిలోని ఎఫ్.సి.ఐ. కాలనీ మెయిన్ రోడ్డులో వర్షపునీరు భారీ ఎత్తున నిలవడంతో పూర్తిగా జలమయమైన రోడ్డుపై వెళ్లే వారు తీవ్ర ఇక్కట్లకు గురికావడం జరుగుతున్న నేపథ్యంలో ఇట్టి విషయాన్ని ఎఫ్.సి.ఐ.కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వెంటనే స్పందించి సంబంధిత అదికారులకు ఫోన్ ద్వారా వెంటనే నీరు నిలిచినా ప్రదేశాన్ని సందర్శించి చర్యలు తీసుకోని ప్రజలకి ఇబ్బందులు కలగాకుండా చూడాలని అదేశించారు. ఈ కార్యక్రమంలో వనస్థలిపురం డివిజన్ బి.అర్.ఎస్.పార్టీ అధ్యక్షులు చింతల రవికుమార్, కాలనీ అధ్యక్షులు నర్సింహారావు, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, కోశాధికారి సత్యనారాయణ, రాజుయాదవ్, కృష్ణరావు, రాజేశ్వర్ రావు, వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.



