పింగిలి రాధమ్మ కన్నుమూత బాధాకరం
- బిఆర్ఎస్ రాష్ట్ర నేత కిషన్
విశ్వంభర,ఇనుగుర్తి: మండల కేంద్రం ఇనుగుర్తి కి చెందిన బిఆర్ఎస్ సీనియర్ నాయకులు పింగిలి శ్రీనివాస్ కు సోమవారం మాతృవియోగం జరిగింది. గాయత్రీ గ్రానైట్స్ గ్రూప్ ఆఫ్ సంస్థల అధినేత, బిఆర్ఎస్ రాష్ట్ర నేత వద్దిరాజు కిషన్, స్థానిక సర్పంచి తమ్మడపల్లి కుమార్, పిఎసిఎస్ చైర్మన్ దీకొండ వెంకన్న గౌడ్, దిశ సభ్యులు గుజ్జునూరి బాబురావు తదితర ప్రముఖులు స్వర్గీయ పింగిలి రాధమ్మ పార్ధివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కిషన్ మాట్లాడుతూ, పింగిలి రాధ కన్నుమూత బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. శ్రీనివాస్ తో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఆపద సమయంలోను ధైర్యాన్ని కోల్పో వద్దని చెప్పారు. వారితోపాటు మాజీ సర్పంచులు దార్ల రామ్మూర్తి, మామిడి శోభన్ బి ఆర్ఎస్ నాయకులు గండు నాగయ్య గౌడ్, పాల్గొన్నారు.చిన్ననాగారం మాజీ సర్పంచి గాయపు జయపాల్ రెడ్డి,జొన్నలగడ్డ అశోక్ రెడ్డి తో పాటు బిఆర్ఎస్ వివిధ పార్టీల నాయకులు అభిమానులు నివాళులర్పించారు.