లాడ్జీలు, హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు
విశ్వంభర, గోదావరిఖని;- గోదావరిఖని వన్‌టౌన్ పరిధిలోని లాడ్జీలు, హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రామగుండం పోలీస్ కమిషనరేట్,పెద్దపల్లి జోన్,గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జీలు, హోటళ్లలో గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి,ఎస్‌ఐ రమేష్ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా స్థానిక లాడ్జీలు,హోటళ్ల యజమానులు మరియు మేనేజర్లకు ఇన్స్పెక్టర్ పలు కీలక సూచనలు జారీ చేశారు.లాడ్జీలు,హోటళ్లలో బసకు వచ్చే ప్రతి వ్యక్తి పూర్తి వివరాలు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని, ముఖ్యంగా ఆధార్ కార్డు పరిశీలించాలని ఆదేశించారు.గది బుక్ చేసుకునే వ్యక్తుల పూర్తి చిరునామా, ఫోన్ నంబర్,గుర్తింపు వివరాలు నమోదు చేయాలని సూచించారు.అలాగే సీసీ కెమెరాల పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలని తెలిపారు.అదేవిధంగా అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యక్తులు గాని, పాత నేరస్తులుగా అనుమానం కలిగే వ్యక్తులు గాని ఉన్నట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. కొంతమంది తప్పుడు సెల్‌ఫోన్ నంబర్లు ఇస్తున్నట్లు సమాచారం ఉందని, అందువల్ల ఫోన్ నంబర్లను కూడా ఒకసారి ధృవీకరించుకోవాలని తెలిపారు.లాడ్జీలు, హోటళ్లలో మద్యం సేవించడం లేదా బయట నుంచి తీసుకువచ్చి మద్యం సేవించడం పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు.అలాగే కొంతమంది బయట వ్యక్తులు వచ్చి పేకాట ఆడుతున్నారనే సమాచారం ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి కార్యకలాపాలకు అనుమతి ఇవ్వకూడదని హెచ్చరించారు. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తిస్తే లాడ్జి మేనేజర్లు, యజమానులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.ముఖ్యంగా మైనర్ బాలికలు, మహిళలు లేదా యువతులు లాడ్జీలు, హోటళ్లకు వచ్చినప్పుడు వారి పూర్తి వివరాలు తెలుసుకోవాలని, వారు ఏ ఉద్దేశంతో వచ్చారో నిర్ధారించుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు, బంధువులు లేదా కుటుంబ సభ్యులతో వచ్చారా లేదా అన్నది తప్పనిసరిగా పరిశీలించాలని పేర్కొన్నారు.ఒకవేళ మైనర్ బాలికలు ఒంటరిగా వచ్చినట్లు అనుమానం కలిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.పోలీసుల ఆదేశాలు, సూచనలు ప్రతి లాడ్జి, హోటల్ యజమాని తప్పనిసరిగా పాటించాలని, నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఇన్స్పెక్టర్ హెచ్చరించారు.