ఓటరు జాబితాపై ప్రజల్లో అపోహలు తొలగించాలి
- టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
విశ్వంభర, నిజామాబాద్: ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట మండలంలో నిర్వహించిన టీపీసీసీ ఆధ్వర్యంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ , స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) పై బూత్ లెవల్ ఏజెంట్ల (బీఎల్‌ఏలు) అవగాహన సదస్సుకు టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ప్రతి అర్హుడైన ఓటరు పేరు నమోదు కావడంతో పాటు అనర్హుల పేర్లు తొలగించేలా బీఎల్‌ఏలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా ప్రజలకు పూర్తి అవగాహన కల్పిస్తూ, ఓటర్లలో ఎలాంటి అపోహలు తలెత్తకుండా చూడాలని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా క్షేత్రస్థాయిలో బీఎల్‌ఏలు చురుకుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజలకు అవసరమైన సమాచారం అందిస్తూ, సవరణ ప్రక్రియను విజయవంతం చేయడంలో పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్యే భూపతి రెడ్డి, మేయర్ ఉమారాణి, డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డి,ఆర్మూర్ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వినయ్ కుమార్ రెడ్డి, తాహెర్ బిన్ తదితరులు పాల్గొన్నారు.