నాలుగేళ్ల తర్వాత మోగిన బడి గంట

నాలుగేళ్ల తర్వాత మోగిన బడి గంట

  • సమిష్టి కృషితో గర్రెపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు పునర్జీవం 

విశ్వంభర, సైదాపూర్ :  నాలుగు సంవత్సరాలుగా విద్యార్థుల నమోదు లేక మూతపడిన గర్రెపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల సోమవారం తిరిగి పునఃప్రారంభమైంది. గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థుల సమిష్టి కృషితో పాఠశాల మళ్లీ పిల్లల కేరింతలతో కళకళలాడింది. ఈ పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు తమ పాత బడి తిరిగి ప్రారంభం కావడంతో ఆనందం వ్యక్తం చేశారు. పాఠశాల పునఃప్రారంభ కార్యక్రమానికి జిల్లా విద్యాధికారి ఎన్. ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలు సమాజానికి వెన్నెముక వంటివని, మూతపడిన పాఠశాలను గ్రామ ప్రజల సహకారంతో తిరిగి ప్రారంభించడం ఆదర్శప్రాయమని అన్నారు. గ్రామస్థుల సహకారంతో సుమారు 20 మంది విద్యార్థులు పాఠశాలలో చేరడం ప్రభుత్వ విద్యపై ప్రజల విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, మెరుగైన మౌలిక వసతులు, సాంకేతిక ఆధారిత బోధన అందుబాటులో ఉన్నాయని, ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు దోకిడి తిరుపతి మాట్లాడుతూ, "నేను కూడా ఈ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోనే చదువుకున్నాను. ఈ బడి మాకు జీవితానికి బలమైన పునాది వేసింది. నేడు మేమంతా వివిధ రంగాల్లో మంచి స్థాయిలో ఉన్నాం. నాలుగు సంవత్సరాలుగా మూతపడిన మా పాఠశాల మళ్లీ ప్రారంభం కావడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ పాఠశాల పునఃప్రారంభానికి ప్రత్యేక చొరవ చూపిన జిల్లా విద్యాధికారి ఎన్. ప్రశాంత్ రెడ్డి, మండల విద్యాధికారి కట్టా రవీంద్ర చారి, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, గ్రామ సర్పంచ్, ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు, తల్లిదండ్రులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇకపై ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ఈ బడిని మరింత అభివృద్ధి చేయడంలో భాగస్వాములు కావాలి" అని అన్నారు. అనంతరం మండల విద్యాధికారి కట్టా రవీంద్ర చారి గ్రామ సర్పంచ్ మాచమల్ల శ్రీకాంత్, ఉపసర్పంచ్ కౌడగాని వీరేశం, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులను శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సెక్టోరల్ అధికారి మిల్కూరి శ్రీనివాస్, మండల విద్యాధికారి కట్టా రవీంద్ర చారి, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు జై గోపాల్ సింగ్, దేవేందర్ రెడ్డి, సత్యనారాయణ, గ్రామ సర్పంచ్ మాచమల్ల శ్రీకాంత్, ఉపసర్పంచ్ కౌడగాని వీరేశం, గ్రామ కార్యదర్శి రాజీవ్, వీవో మహిళా బెల్లి రజిత, అంగన్‌వాడీ టీచర్ అమరగొండ డ పద్మ, మాజీ ఉపసర్పంచ్ దాసరి రవీందర్, బీఆర్‌ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు దోకిడి తిరుపతి, వార్డు సభ్యులు, సీఆర్పీలు రమేష్, చక్రపాణి, శ్రీనివాస్ రెడ్డి, విద్యార్థులు, తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు, విద్యాభిమానులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

🕒 30 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/after-four-years-the-school-bell-rang/article-17410

Tags: