సుందరయ్య పార్క్ ఫుట్‌పాత్‌పై క్యాంటీన్ నిర్మాణం నిలిపివేయాలి

విశ్వంభర, హైదరాబాదు : హైదరాబాదు బాగ్ లింగంపల్లి సుందరయ్య పార్క్ ప్రధాన ద్వారం సమీపంలోని ఫుట్‌పాత్‌పై చేపట్టిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ నిర్మాణ పనులను నిలిపివేసి, ప్రజలకు ఇబ్బంది కలగని ప్రత్యామ్నాయ స్థలంలో ఏర్పాటు చేయాలని వాకర్స్, స్థానిక ప్రజలు కోరారు. ప్రస్తుతం నిర్మాణం జరుగుతున్న ప్రదేశం అత్యంత రద్దీగా ఉండే ప్రధాన రహదారి కావడంతో ప్రతిరోజూ ఫుట్‌పాత్‌ను వినియోగించే వాకర్స్, సీనియర్ సిటిజన్లు, మహిళలు, పిల్లలకు ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. క్యాంటీన్ నిర్మాణం వల్ల ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేపట్టిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ పథకాన్ని స్వాగతిస్తున్నప్పటికీ, ప్రజల భద్రత, సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఫుట్‌పాత్‌పై కాకుండా అనువైన ప్రత్యామ్నాయ స్థలంలో క్యాంటీన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

🕒 03 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/construction-of-canteen-on-footpath-of-sundarayya-park-should-be/article-17788

Tags: