రావిరాలలో సంబురంగా ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం

విశ్వంభర, నెల్లికుదురు: మండలంలోని రావిరాల గ్రామానికి చెందిన ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు కోరు కొప్పుల స్పందన నరేష్ దంపతులు తమ గృహ నిర్మాణం పూర్తి చేసుకొని  బంధుమిత్రులు, శ్రేయోభిలాషుల మధ్య  గురువారం ఆనందోత్సాహాల తో సంబురంగా గృహప్రవేశం చేశారు. బ్రాహ్మణోత్తముల మంత్రోచ్ఛరణల మధ్య ముందుగా గోమాతను ఇంటిలోకి ఆహ్వానించారు.అనంతరం పూజాతి క్రతువులు నిర్వహించారు. లబ్ధిదారుల తల్లి ప్రమీల కూతురు అల్లుడు బొమ్మెర శిరీష సతీష్ గౌడ్ తో పాటు సోదరులు వదినలకు బొమ్మెర లచ్చయ్య గౌడ్ యాకమ్మ,జెన్నయ్య గౌడ్ సుభద్ర,సత్తయ్య గౌడ్ సుజాత లకు నూతన వస్త్రాలు సమర్పించి శుభా ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు స్పందన నరేష్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఇల్లు నిర్మించుకోవాలనే కల కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లుతో నెరవేరిందని సంతోషం వ్యక్తం చేశారు. పక్కా ఇల్లు లేకపోవడంతో ఎంతో ఇబ్బంది పడే వారమని నూతన ఇంటి నిర్మాణంతో బాధ తొలగిపోయిందని ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గ్రామస్తులు బంధుమిత్రులు పాల్గొన్నారు.

🕒 03 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/in-the-evening-samburanga-indirammas-house-enters-the-house/article-17802

Tags: