గుడిసెలకు పట్టాల కోసం జులై 6న ధర్నా
విశ్వంభర, విద్యానగర్ : ప్రతి గుడిసెకు పట్టా, పేదలకు పక్కా ఇల్లు మంజూరు చేయాలి, పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలనే డిమాండ్‌తో ఈ నెల 6న హైదరాబాదులోని ఇందిరా పార్క్ ధర్నాచౌక్ వద్ద భారీ ధర్నా నిర్వహించాలని లెఫ్ట్ పార్టీలు నిర్ణయించాయి. హైదరాబాదు విద్యానగర్‌లోని మార్క్స్ భవన్‌లో గురువారం జరిగిన లెఫ్ట్ పార్టీల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని గుడిసెవాసులందరికీ భూ పట్టాలు, పక్కా ఇళ్లు మంజూరు చేయాలని, ఏజెన్సీ ప్రాంతాల్లో సాగులో ఉన్న పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఎమ్మెల్యే పశ్య పద్మ ఈ.టి. నర్సింహ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, అబ్బాస్, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు సాదినేని వెంకటేశ్వరరావు, కె. గోవర్ధన్, మాస్‌లైన్ రాష్ట్ర నాయకుడు ఎం. హన్మేశ్, ఎంసీపీఐ రాష్ట్ర నాయకుడు వనం సుధాకర్, ఎస్‌యూసీఐ నాయకుడు భరత్ పాల్గొన్నారు.