నాగారం కాంగ్రెస్ అధ్యక్ష నియామకంపై సీనియర్ నాయకుల అసంతృప్తి
- బంధుత్వం ఆధారంగా పదవి ఇచ్చారంటూ ఆరోపణలు
విశ్వంభర, మేడ్చల్ : జిల్లాలోని పలు డివిజన్లకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను నియమించిన నేపథ్యంలో, నాగారం డివిజన్ అధ్యక్షుడిగా ఎలసాని భూమయ్య యాదవ్ నియామకాన్ని స్థానిక కాంగ్రెస్ సీనియర్ నాయకులు వ్యతిరేకించారు. వారు మాట్లాడుతూ, పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా పనిచేసిన సీనియర్ కార్యకర్తలను పక్కనపెట్టి, బంధుత్వానికి ప్రాధాన్యం ఇచ్చి నియామకం చేపట్టారని ఆరోపించారు. దీంతో నిజాయితీగా పనిచేసే కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నంరాజు సతీష్ గౌడ్ మాట్లాడుతూ, తాను 20 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో సేవలందిస్తున్నప్పటికీ, పదవి దక్కలేదని, అయితే బంధుత్వం ఆధారంగా డివిజన్ అధ్యక్ష పదవి ఇవ్వడం బాధాకరమని అన్నారు. మాజీ సర్పంచ్ గూడూరు అశోక్ గౌడ్ మాట్లాడుతూ, 1978 నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్న సీనియర్ నాయకులకు కనీస గౌరవం ఇవ్వకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. నాగారం మున్సిపల్ పరిధిలో పలువురు కార్యకర్తలు ఈ నియామకాన్ని వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాసరెడ్డి, మాజీ కౌన్సిలర్ పంగ హరిబాబు, దాసోహం నర్సింగ్‌రావు, బాలు యాదవ్, దాసరి రాంరెడ్డి, కిట్టు యాదవ్, సత్యనారాయణ యాదవ్, రవి, పంగ శ్రీహరి, గౌస్, ప్రవీణ్ యాదవ్, రామాగోని శ్రీనివాస్ గౌడ్, మనోహర్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.