ఘనంగా అంతర్జాతీయ లెవెల్ క్రాసింగ్ అవగాహన దినోత్సవం 

 విశ్వంభర, జిహెచ్ ఎం సి : అంతర్జాతీయ రైల్వేల సంఘం మంగళవారం  అంతర్జాతీయ లెవెల్ క్రాసింగ్ అవగాహన దినోత్సవాన్ని పాటిస్తోంది. ఇందులో భాగంగా, రోడ్డు  వినియోగదారులలో అవగాహన కల్పించడానికి,రైల్వే లెవెల్ క్రాసింగ్ గేట్ల వద్ద సురక్షితమైన పద్ధతులను ప్రోత్సహించడానికి జరుగుతున్న ఈ ప్రపంచవ్యాప్త ప్రచారంలో దక్షిణ మధ్య రైల్వే కూడా పాల్గొంటోంది. దక్షిణ మధ్య రైల్వే  పరిధిలో రైలు సేవలు పెరుగుతున్న నేపథ్యంలో, రైళ్ల సురక్షిత రవాణా కోసం లెవల్ క్రాసింగ్ గేట్లు తరచుగా మూసివేయబడుతున్నాయి. దీనివలన, తరచుగా ట్రాఫిక్ రద్దీ ఏర్పడి, రోడ్డు  వినియోగదారులకు అసౌకర్యం కలుగుతోంది. ఈ సమస్యలను పరిష్కరించడానికి దక్షిణ మధ్య రైల్వే రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పరిమిత ఎత్తు సబ్‌వేలు (ఎల్.ఎచ్.ఎస్), రోడ్ అండర్ బ్రిడ్జ్‌లు (ఆర్.యూ.బిలు) మరియు రోడ్ ఓవర్ బ్రిడ్జ్‌లు (ఆర్.ఓ. బిలు) వంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లను అందిస్తూ, దశలవారీగా లెవెల్ క్రాసింగ్ల(ఎల్.సిల)తొలగింపును చేపట్టింది.అంతేకాకుండా, లెవల్ క్రాసింగ్‌ల వద్ద భద్రతను మెరుగుపరచడానికి  పలు చర్యలను అమలు చేస్తోంది. వాటిలో ప్రముఖంగా చెప్పదగినవి  హెచ్చరిక బోర్డులు మరియు సూచికల ఏర్పాటు, రైల్వే అధికారుల ద్వారా క్రమం తప్పని భద్రతా తనిఖీలు, లెవల్ క్రాసింగ్‌ల వద్ద విధులు నిర్వహించే సిబ్బందికి అవగాహన కార్యక్రమాలు, లెవల్ క్రాసింగ్‌ల వద్ద పాటించవలసిన  భద్రతా విధానాలపై లొకో పైలట్లకు , అసిస్టెంట్ లొకో పైలట్లకు   మరియు రైలు నిర్వహణలో పాల్గొనే సిబ్బందికి  ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు . ఈ చర్యల ద్వారా, దక్షిణ మధ్య రైల్వే  రోడ్డు  వినియోగదారులకు అసౌకర్యాన్ని తగ్గిస్తూ, రైలు రవాణా భద్రతను మరింత బలోపేతం చేస్తోంది.అంతర్జాతీయ లెవెల్ క్రాసింగ్ అవగాహన దినోత్సవ ప్రచారంలో భాగంగా, ఈ జోన్‌లోని మూడు డివిజన్ల (సికింద్రాబాద్, హైదరాబాద్ మరియు నాందేడ్) లెవెల్ క్రాసింగ్‌ల వద్ద ప్రజల్లో అవగాహన పెంచేందుకు విస్తృత ప్రచార కార్యక్రమాలను నిర్వహించాయి. లెవల్ క్రాసింగ్ వద్ద అజాగ్రత్త ప్రవర్తన వల్ల కలిగే ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వీధి-నాటకాలు ప్రదర్శించబడగా, లెవల్ క్రాసింగ్ వద్ద ప్రత్యేక తనిఖీలు కూడా చేపట్టబడ్డాయి. ఈ జోన్ లెవెల్ క్రాసింగ్‌ల వద్ద భద్రతా మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించడం యొక్క ప్రాముఖ్యతపై ఎక్కువ మందికి అవగాహన కల్పించడానికి, దక్షిణ మధ్య రైల్వే సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కూడా అవగాహన ప్రచారాన్ని చేపట్టింది. ఈ సంధర్భంగా దక్షిణ మధ్య రైల్వే  2018లోనే తన నెట్‌వర్క్ పరిధిలో మానవ రహిత లెవల్ క్రాసింగ్‌లను (యూ. ఎమ్.ఎల్.సి) పూర్తిగా తొలగించిన తొలి జోన్‌లలో ఒకటి అని పేర్కొనడం సముచితం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర మరియు కర్ణాటక రాష్ట్రాల్లోని ఆరు డివిజన్లను కలిగి ఉన్న దక్షిణ మధ్య రైల్వే  పరిధిలో, 2025-26 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 65 మానవ సహిత లెవల్ క్రాసింగ్‌లు తొలగించబడ్డాయి. దక్షిణ మధ్య రైల్వే  ప్రస్తుత 2026-27 ఆర్థిక సంవత్సరంలో, సికింద్రాబాద్, హైదరాబాద్ మరియు నాందేడ్ మూడు డివిజన్ల పరిధిలో మానవ సహిత లెవల్ క్రాసింగ్‌లను వేగంగా తొలగించే దిశగా కృషి చేస్తోంది.దక్షిణ మధ్య రైల్వే  జనరల్ మేనేజర్ శ్రీ సంజయ్ కుమార్ గారు, రైల్వే లెవల్ క్రాసింగ్‌ల వద్ద రోడ్డు వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని మరియు నిబంధనలను పాటించాలని పిలుపునిచ్చారు. వాహనం నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, భద్రతా మార్గదర్శకాలను విస్మరించి తమ ప్రాణాలకు లేదా ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగించవద్దని ఆయన ప్రయాణికులకు సూచించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లక్ష్యంగా పెట్టుకున్న మానవ సహిత లెవల్ క్రాసింగ్‌ల తొలగింపు ప్రక్రియను విజయవంతం చేయడానికి, తమ కృషిని   కొనసాగించాలని ఆయన అధికారులకు సూచించారు. అలాగే జనరల్ మేనేజర్ జోన్ పరిధిలో మానవ సహిత లెవల్ క్రాసింగ్‌లు పూర్తిగా తొలగించబడే వరకు, వాటి వద్ద అన్ని భద్రతా నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని సిబ్బందిని ఆదేశించారు.

🕒 10 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/happy-international-level-crossing-awareness-day/article-16366

Tags: