గాంధీజీ విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
నియోజకవర్గ ప్రధమ ర్యాంకర్, ప్రతిభ చాటిన విద్యార్థులకు సన్మానం
విశ్వంభర, చండూరు: ఇటీవల ప్రకటించిన పదవ తరగతి ఫలితాలలో చండూరు మున్సిపాలిటీ కి చెందిన గాంధీజీ విద్యాసంస్థల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి 588 /600 మార్కులతో కారింగు దీక్షిత మునుగోడు నియోజకవర్గం మొదటి ర్యాంకును సాధించినందులకు గాను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి శాలువా కప్పి, పుష్పగుచ్చమును అందించి ఘనంగా సన్మానించి, అభినందించారు. అలాగే 580 మార్కులు సాధించిన శిరంశెట్టి అక్షరను, 579 మార్కులు సాధించిన కందుల దివ్యను, 575 మార్కులు సాధించిన తుమ్మల జయశ్రీని, 573 మార్కులు సాధించిన ఆలేటి శిరీషను, 572 మార్కులు సాధించిన భూతరాజు ఐశ్వర్యను, 571 మార్కులు సాధించిన నారాబోయిన కుమార స్వామిలందరిని అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ గాంధీజీ విద్యాసంస్థలు గత సంవత్సరం 590 మార్కులతో జిల్లా మొదటి ర్యాంకులు సాధించి, మళ్లీ ఈ సంవత్సరం కూడా 588 మార్కులను సాధించి మునుగోడు నియోజకవర్గం లో మొదటి స్థానంలో ఉండడం గర్వకారణం అని అన్నారు.విద్యార్థులందరూ బాగా కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని, పుట్టిన ఊరుకు, కన్న తల్లిదండ్రులకు, చదివిన పాఠశాలకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు. విద్యార్థులకు ఉత్తమ విద్యను అందిస్తున్న గాంధీజీ విద్యాసంస్థల యాజమాన్యంను, ఉపాధ్యాయ బృందంను అభినందించారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యాసంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న, కర్నాటి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.