సెన్సస్ నిర్వహణలో అధికారులు సమన్వయంతో పనిచేయాలి
- డీసీఓ భారతి హోళీకేరి
విశ్వంభర, మహబూబాబాద్: రాష్ట్రంలో సెన్సస్–2027 కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేసి, ఎటువంటి పొరపాట్లు లేకుండా ప్రక్రియను పూర్తి చేయాలని డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ (డీసీఓ) భారతి హోళీకేరి అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. శుక్రవారం హైదరాబాదు నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీసీఓ భారతి హోళీకేరి మాట్లాడుతూ సెన్సస్–2027 కార్యక్రమం దేశ ప్రణాళికా రూపకల్పనకు కీలకమైందని తెలిపారు. జనగణనకు సంబంధించిన పెండింగ్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని ఆదేశించారు.ప్రస్తుతం కొనసాగుతున్న సెల్ఫ్ ఎన్యుమరేషన్ ప్రక్రియపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని తెలిపారు. డేటా నమోదు సమయంలో ఎటువంటి లోపాలు చోటుచేసుకోకుండా నిరంతర పర్యవేక్షణ నిర్వహించాలని, గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో సాంకేతిక సహాయం అవసరమైన వారికి తగిన సహకారం అందించాలని సూచించారు. ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్ల నియామక ప్రక్రియను పూర్తి చేసి, వారికి సమగ్ర శిక్షణ అందించాలని ఆదేశించారు. సెన్సస్‌కు అవసరమైన మాన్యువల్స్, సూపర్వైజర్ కిట్స్, మ్యాప్స్ తదితర సామగ్రి పంపిణీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. అదనపు రిజర్వ్ సిబ్బందిని కూడా సిద్ధంగా ఉంచాలని సూచించారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్‌లో ఐ డి ఓ సి కార్యాలయం క్యాంపు కార్యాలయం నుండి పాల్గొన్న జిల్లా అదనపు కలెక్టర్ కె. అనిల్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో సెన్సస్–2027 ఏర్పాట్లను విస్తృత స్థాయిలో చేపట్టామని తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం అన్ని శాఖల సమన్వయంతో కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్ల ఎంపిక, శిక్షణ కార్యక్రమాలు, ఫీల్డ్ స్థాయి పర్యవేక్షణ తదితర అంశాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తున్నామని తెలిపారు . అనంతరం సెన్సస్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలని, డేటా ఖచ్చితత్వంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అదనపు కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో సిపిఓ శ్రీనివాస రావు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.