ఏఎన్‌ఎంలకు 100 శాతం గ్రాస్ శాలరీ అమలు చేయాలి: ఏఐటీయూసీ
విశ్వంభర, హిమాయత్ నగర్ : నేషనల్ హెల్త్ మిషన్‌లో పనిచేస్తున్న రెండో ఏఎన్‌ఎంలకు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 100 శాతం గ్రాస్ శాలరీ అమలు చేయకపోతే మరోసారి ఉద్యమం చేపడతామని ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం. నరసింహ హెచ్చరించారు. హైదరాబాదు హిమాయత్ నగర్ లోని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యాలయంలో తోట రామాంజనేయులు అధ్యక్షతన జరిగిన రెండో ఏఎన్‌ఎంల రాష్ట్ర నిర్మాణ మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో విడుదలైన రెండో ఏఎన్‌ఎంల నియామక నోటిఫికేషన్‌కు సంబంధించి తుది ఫలితాలను వెంటనే ప్రకటించాలని, నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగం రాని రెండో ఏఎన్‌ఎంలు, ఈసీ ఏఎన్‌ఎంలు, ఔట్‌సోర్సింగ్ ఏఎన్‌ఎంలకు 100 శాతం గ్రాస్ శాలరీతో పాటు రూ.10 లక్షల ఆరోగ్య బీమా, రూ.10 లక్షల జీవిత బీమా అమలు చేయాలని కోరారు. పోస్టుల పెంపు అంశంపై త్వరలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహను కలిసి వినతిపత్రం అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో: పి. సుమతి మెటల్డా అశ్విని ఎం. నాగమణి టి. స్వాతి రెడ్డి విజయలక్ష్మి విజయ కుమారి గునుగుండ్ల విజయ కుమారి జి. సబితా పాల్గొన్నారు.