జులై 6న మహాధర్నా.. సెప్టెంబర్ 1న 'చలో ఢిల్లీ': సీపీఐ
విశ్వంభర, హైదరాబాద్: ప్రతి గుడిసెకు భూ పట్టా, ప్రతి పేదవానికి ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జులై 6న హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్లు సీపీఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. మఖ్దూం భవన్‌లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్రంలోని గుడిసెవాసులకు భూ పట్టాలు, పక్కా ఇళ్లు, పోడు భూములు సాగు చేస్తున్న గిరిజనులు, పేదలకు సాగు హక్కు పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భూ భారతి చట్టంలో సాగుదారుల హక్కులను పరిరక్షించేలా మార్పులు చేయాలని కోరారు. సింగరేణి సంస్థకు రావాల్సిన బకాయిలు, కార్మికుల సమస్యలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని, కార్మికులకు కనీస వేతనాలు అమలు చేసి పెండింగ్ నిధులను విడుదల చేయాలని కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆగస్టు 6 నుంచి 15 వరకు దేశవ్యాప్తంగా పాదయాత్రలు, సెప్టెంబర్ 1న 'చలో ఢిల్లీ' కార్యక్రమం నిర్వహిస్తామని కె. రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.