విశ్వంభర వార్తకు స్పందన.. 25వ వార్డును సందర్శించిన మున్సిపల్ ఏఈ

విశ్వంభర, మహబూబాబాద్: విశ్వంభర దినపత్రికలో "చిన్న వర్షానికి చిత్తడి" శీర్షికతో ప్రచురితమైన కథనానికి మున్సిపల్ అధికారులు స్పందించారు. గురువారం మున్సిపల్ ఏఈ సౌజన్య 25వ వార్డును సందర్శించి స్థానిక సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా వార్డు కమిటీ కన్వీనర్, సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యుడు నర్రా శ్రావణ్ మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు రోడ్లు, డ్రైనేజీలు తదితర అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసినప్పటికీ ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అభివృద్ధి పనులు ప్రారంభించాలని ఏఈని కోరారు. దీనిపై స్పందించిన ఏఈ సౌజన్య, రెండు నుంచి మూడు రోజుల్లో కాంట్రాక్టర్‌తో మాట్లాడి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. హామీ అమలు కాకపోతే రోడ్లు, డ్రైనేజీ పనులు పూర్తయ్యే వరకు దశలవారీగా ఆందోళనలు కొనసాగిస్తామని నర్రా శ్రావణ్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్క్ ఇన్‌స్పెక్టర్ కాగితం శ్రీనివాస్, సీపీఐ నాయకులు మంద శంకర్, దారమల్ల మహేష్, మొలకలపల్లి సమ్మక్క, ఉపేంద్ర, అనూష, సులోచన, తండా శ్రీనాథ్, రాకేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.

🕒 24 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/municipal-ae-visited-ward-25-in-response-to-vishwambhara-news/article-19553

Tags: