ఎల్బీనగర్ చౌరస్తా లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న దిష్టిబొమ్మ దహనం 

 ఎల్బీనగర్ చౌరస్తా లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న దిష్టిబొమ్మ దహనం 

రెడ్డి లపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా రోడ్డుపై బైఠాయింపు 

విశ్వంభర, ఎల్బీనగర్ : రెడ్డి సామాజిక  వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ దిష్టిబొమ్మను చౌరస్తాలో రెడ్డి సంఘాల ప్రజాప్రతినిధులు  దహనం చేశారు. రెడ్డి సామాజిక వర్గ నాయకులూ, సంఘాల ప్రతినిధులతో కలిసి ప్రధాన రహదారిపై రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు.  రెడ్డి సామాజిక వర్గాన్ని లక్ష్యంగా పెట్టుకొని  గత కొన్ని రోజులుగా  తీవ్రమైన పరుష  పదజాలంతో దూషిస్తున్న నేపథ్యంలో ఇటీవల ఒక సభలో రెడ్డిలపై పరుష వాఖ్యల పట్ల రెడ్డి సామాజిక వర్గ మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ను వెంటనే బర్తరఫ్ చేయాలనీ కోరుతూ అలాగే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ లో ప్రముఖ న్యాయవాది రావుల వెంకట్ రెడ్డి , రెడ్డి ఉమెన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నూకల పద్మారెడ్డి  పిర్యాదు చేసారు. ఈ కార్యక్రమంలో గీతారెడ్డి , శ్రీనివాస్ రెడ్డి , వెంకట్ రెడ్డి , అంజి రెడ్డి , రెడ్డి సంఘాల ప్రజా ప్రతినిధులు , మహిళలు పాల్గొన్నారు. 

Tags: