ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు హక్కు వినియోగించుకున్న కోరుట్ల ఎమ్మెల్యే
విశ్వంభర, మెట్ పల్లి : జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయము లోని 233 పోలింగ్ బూత్ కేంద్రంలో పట్లభద్రుల ఎమ్మెల్సీ ఓటు హక్కును ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల సంజయ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ విద్యాధికులు ప్రతి ఒకరు అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధికి అభ్యున్నతికి తోడ్పాటు అందించే వారిని ఎన్నుకోవాలని పట్ట బద్రుల ఎన్నికల క్యాంపెయిన్ లో పాల్గొన్నప్పుడు జాతీయ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ కులం ఏది అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కులం ఏది అని కుల పంచాయతీని లేవనెత్తారని కుల రాజకీయాలు మాని రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడే వారికి తమ ఓటు వెయ్యాలని కోరారు, ఎమ్మెల్యే తో పాటు అంగడి పురుషోత్తం, జావీద్, బంగారు కళ్ళ కిషోర్ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.



