వృద్ధురాలికి రక్త దానం
On
విశ్వంభర, అనంతగిరి : కోదాడ లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో రక్తం తక్కువగా ఉండి ప్రాణాపాయ స్థితిలో ఉన్న మహిళకు మండల పరిధిలోని వాయిల సింగారం గ్రామానికి చెందిన ఎస్వీ విద్యా సంస్థల ప్రిన్సిపాల్ గద్దె రఘు రక్త దానం చేశారు. కోదాడ కు చెందిన వజ్రపు సక్కుభాయి(70) అనే మహిళ ఆరోగ్య పరిస్థితి బాలేక పట్టణంలో ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతోంది. ఈ క్రమంలో ఆమెకు రక్తం తక్కువగా ఉందనీ వైద్యులు చెప్పడంతో స్వర్ణ భారతి ట్రస్ట్ వారు సదరు మహిళ ఆరోగ్య పరిస్థితి సమాచారం తెలుసుకుని "ఓ" పాజిటివ్ గ్రూపు రక్తం కావాలని గద్దె రఘును సంప్రదించగా ఆయన వెంటనే స్పందించి సదరు వ్యక్తికి రక్త దానం చేసారు.



