కే.కే కమిటీ సమావేశానికి ఉద్యమకారులు హాజరు కావాలి
విశ్వంభర, రామన్నపేట: ఉద్యమ కారుల కోసం ప్రత్యేకంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కే.కే కమిటీకి శుక్రవారం హైదరాబాద్ లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఉద్యమకారులు హాజరు కావాలని ఉద్యమ కారుల ఫోరం రాష్ట్ర మైనార్టీ సెల్ కన్వీనర్ షేక్ చాంద్, జిల్లా నాయకులు బొడ్డుపల్లి లింగయ్య, నోముల శంకర్ లు కోరారు. హైదరాబాదులో సెక్రటేరియట్ ముందు గల అమర జ్యోతి భవనంలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఉమ్మడి నల్లగొండ జిల్లాలకు సంబంధించిన ఉద్యమకారులతో కే.కే కమిటీ బృందం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని, కమిటీకి మన సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని, మన ఉమ్మడి నల్లగొండ జిల్లా నుండి ఉద్యమకారులు అధిక సంఖ్యలో తరలి రావాలని కోరారు.