సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం : చిలకమర్రి
On
విశ్వంభర, హైదరాబాద్ : సుప్రీంకోర్టు నేడు ఇచ్చిన తీర్పును ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు, ఆల్ ఇండియా బహుజన్ సత్తా అధ్యక్షులు, పూలే అంబేడ్కర్ మిషన్ నేషనల్ కోఆర్డినేటర్ చిలకమర్రి నరసింహ స్వాగతించారు. భారతదేశంలోని ఎస్సీలు, బౌద్ధం మతం, హిందూ మతం, సిక్కు మతాలలోనీ ఎస్సీ లు తప్ప ఇతర మతాలలోకి మతం మారిన వారికి భారతదేశంలోని ఎస్సీలకు, రాజ్యాంగ బద్దంగా వర్తించే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఆక్ట్ గాని ఇతర సదుపాయాలు గాని వర్తించవని సుప్రీమ్ కోర్ట్ ఇచ్చిన తీర్పు ను ఆయన స్వాగతించారు. ఇందులో రాజ్యాంగపరమైన పదవులైన ప్రజాప్రతినిధులకు వర్తించే రిజర్వేషన్లు గాని, ఉద్యోగ నియామకంలో ఉండే రిజర్వేషన్లు గాని, ప్రమోషన్లు గాని ఇతర ఆర్థిక సంబంధమైన సదుపాయాలు గాని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ గాని కేవలం హిందూ మతంలోని ఎస్సీలకు, బౌద్ధమతంలోని ఎస్సీలకు సిక్కు మతంలోని ఎస్సీలకు మాత్రమే వర్తిస్తుంది తప్ప ఇతర మతాలలోకి వెళ్లిన మతం మారిన ఎస్సీ లకు వర్తించదని భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రతి ఒక్కరు స్వాగతించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ తీర్పుతో హిందు, సిక్కు, బౌద్ధమతంలో ఉన్న ఎస్సీలకు మరిన్ని అవకాశాలు కలిగి తద్వారా ఎస్సీలు ఇంకా ఎక్కువగా లబ్ధి పొంది జీవితంలో మరింత ఎదిగే అవకాశం ఉందని అన్నారు. ఇంతకాలంగా మతం మారిన ఎస్సీలు ఇప్పటికీ దొడ్డి దారిలో ఎస్సీ సర్టిఫికెట్లు పొంది అనేక సంవత్సరాలుగా లబ్ధి పొందడంతో హిందూ, బౌద్ధం, సిక్కు మతాలలో ఉన్న నిజమైన ఎస్సీలకు తీవ్రం అన్యాయం జరిగిందని ఆయన పేర్కొన్నారు.



