సదాశివపేట రోటరీ క్లబ్‌కు రాష్ట్రస్థాయి అవార్డులు
విశ్వంభర, సదాశివపేట: సేవా కార్యక్రమాలతో తొలి ఏడాదిలోనే రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందిన సదాశివపేట రోటరీ క్లబ్‌కు 'శోభితం–2025-26' అవార్డుల కార్యక్రమంలో ఒక బంగారు పతకం, నాలుగు వెండి పతకాలు లభించాయి. కాకతీయ రీజియన్‌లో నూతనంగా ఏర్పాటైన క్లబ్‌లలో రెండో స్థానం సాధించినట్లు క్లబ్ అధ్యక్షుడు ఓదెల ప్రభు గుప్త తెలిపారు. గత ఏడాది నిర్వహించిన మెగా క్యాన్సర్ స్క్రీనింగ్, ఆరోగ్య శిబిరాలు, విద్యార్థులకు కెరీర్ మార్గదర్శక కార్యక్రమాలు, ఈఎన్‌టీ పరీక్షలు, ఉపాధి కల్పన కోసం జాబ్ మేళా, సరస్వతి శిశు మందిర్ పాఠశాలకు నూతన అంతస్తు నిర్మాణం వంటి సేవా కార్యక్రమాలకుగాను ఈ గుర్తింపు లభించిందని క్లబ్ ప్రతినిధులు తెలిపారు. ఈ విజయానికి జిల్లా గవర్నర్ ఓడల రాజశేఖర్‌తో పాటు క్లబ్ సభ్యుల సహకారం ఎంతో దోహదపడిందని వారు పేర్కొన్నారు.