కాంగ్రెస్ ప్రభుత్వం తోనే అభివృద్ధి, సంక్షేమం

  • కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షులు యాదవ రెడ్డి

విశ్వంభర, నెల్లికుదురు: పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తోనే అభివృద్ధి, సంక్షేమం వడివడిగా జరుగుతోందని కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షులు ఎదల్ల యాదవ రెడ్డి అన్నారు. నెల్లికుదురు మండలం మునిగల వీడు గ్రామానికి చెందిన ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు నీరుటి అనంతరెడ్డి విజయ దంపతుల గృహప్రవేశ వేడుకలో స్థానిక సర్పంచి బొల్లికొండ చైతన్య నాగరాజు తో పాటు వివిధ గ్రామాల సర్పంచులు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అర్హులైన పేదలందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విడతల వారీగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తుందన్నారు. రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, గృహాలకు 200 యూనిట్లు విద్యుత్ ఫ్రీ, మహిళలకు బస్సు ప్రయాణం ఉచితం,పేదలకు సన్న బియ్యం వంటి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి ప్రజల చేత మన్ననలు పొందుతోందన్నారు. కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు వీరన్న నాయక్,రామ్ సింగ్, కత్తుల కళ్యాణి యాకాంతం,ఇట్టె లీలా దేవేందర్ రెడ్డి,హేమలత శ్రీను,గోగుల మమత ప్రశాంత్,సోమన్న, కాంగ్రెస్ మండల అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్,నాయకులు సత్యపాల్ రెడ్డి, లక్ష్మారెడ్డి, బాలాజీ నాయక్,ఆకుతోట సతీష్,నాగరాజు,తుప్పతూరి రాజు యాదవ్,సతీష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

🕒 03 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/development-and-welfare-with-the-congress-government/article-17754

Tags: