కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి సమష్టిగా కృషి చేయాలి
- టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
విశ్వంభర, దోమ: మండల పరిధిలోని దిర్సంపల్లి గ్రామంలోని పటేల్ ఫంక్షన్ హాల్‌లో దోమ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శాంత కుమార్ ఆధ్వర్యంలో మండల స్థాయి కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పరిగి ఎమ్మెల్యే,టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి హాజరై పార్టీ బలోపేతం, గ్రామస్థాయిలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపట్టడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటి అంశాలపై పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. బడేంపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన స్వయం సహాయక సంఘం భవనాన్ని ప్రారంభించారు. బుడ్లాపూర్ గ్రామంలో పాఠశాల ప్రహరీ గోడ ను ప్రారంభించారు. కిష్టాపూర్ గ్రామంలో సీసీ రోడ్లను ప్రారంభించి, స్వయం సహాయక సంఘం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. పరిగి నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ జరగని స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పరిగి నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకెళ్తోందని అన్నారు.గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.50 వేల కోట్లతో రహదారులు, రైల్వే, ఆరోగ్యం, విద్య, సాగునీరు, పారిశ్రామిక రంగాల్లో అనేక అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. పరిగి నియోజకవర్గం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోందని సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తోందని పేర్కొన్నారు. రీజినల్ రింగ్ రోడ్ రేడియల్ రోడ్, నేషనల్ హైవే, రైల్వే లైన్, నేవీ రాడార్ స్టేషన్, ఎకో అర్బన్ పార్క్ వంటి భారీ ప్రాజెక్టులు పరిగి నియోజకవర్గానికి రానుండటంతో ఈ ప్రాంత రూపురేఖలు మారనున్నాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనలో ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, రైతు రుణమాఫీ, రైతు భరోసా, సన్నబియ్యం పంపిణీ వంటి సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని తెలిపారు. వరి రైతులకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందించడంతో పాటు సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటోందన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ ప్రతి కార్యకర్త ప్రజల్లోకి తీసుకెళ్లాలని, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ఇంటింటికీ తీసుకు వెళ్లాలన్నారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు శాంతుకుమార్, మండల పిఎసిహెచ్ చైర్మన్ యాదవ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు శేషారెడ్డి, రాఘవేందర్ రెడ్డి, రాములు గౌడ్, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.