సీనియర్ సిటిజన్స్  సమావేశం

సీనియర్ సిటిజన్స్  సమావేశం

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలోని మండల సీనియర్ సిటిజన్స్ మండల అధ్యక్షులు జెల్ల శ్రీరాములు అధ్యక్షతన జరిగిన రామన్నపేట మండల సీనియర్ సిటిజన్స్ కమిటీ సమావేశంలో ఆల్ సీనియర్ సిటిజన్స్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాపోలు నరసయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సీనియర్ సిటిజన్స్ కు ఎలాంటి షరతులు లేకుండా ఆసరా పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయని, భూములు ఉన్నాయని, కొంతమంది సీనియర్ సిటిజన్స్ కు పెన్షన్ ఇవ్వని కారణంగా వారు నిరాదరణకు గురవుతున్న విషయాలు ప్రభుత్వం ఆలోచన చేయాలని అన్నారు. సీనియర్ సిటిజన్స్ కు రామన్నపేట మండలంలో ఎలాంటి ఇబ్బందులు జరిగినా, మండల శాఖను సంప్రదించాలని వారి సమస్యలు పరిష్కారం కాని ఎడల రాష్ట్ర కమిటీ నుండి సమస్య పరిష్కారం అయ్యే విధంగా సీనియర్ సిటిజన్స్ కు రాష్ట్ర కమిటీ అండగా ఉంటుందని అన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి రాపోలు నరసింహా, సిరిపురం చేనేత సహకార సంఘం అధ్యక్షులు అప్పం రామేశ్వరం, సీనియర్ సిటిజన్స్ మండల కార్యదర్శి కూనూరు సుదర్శన్, సీనియర్ సిటిజన్స్ మండల ఉపాధ్యక్షులు మిర్యాల భాస్కర్, నాయకులు మిరియాల రామలింగం, రాపోలు లక్ష్మీనారాయణ, రాపోలు విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.

Tags: