బాగ్ అంబర్పేట్ లో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పాదయాత్ర 

 

WhatsApp Image 2024-07-08 at 3.34.59 PM (1)
అంబర్పేట నియోజకవర్గం బాగ్ అంబర్పేట్ డివిజన్ పోచమ్మ బస్తి ,కురుమ బస్తీలో ఈరోజు అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పాదయాత్ర నిర్వహించారు.ఈ సందర్బంగా కాలనిలో  ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటూ సీసీ రోడ్డు సమస్య ఉందని ప్రజలు చెప్పడం తో ఎక్కడెక్కడ ప్యాచ్ వర్క్ అవసరం ఉంటుందో అక్కడ పని పూర్తి చేసి, రోడ్డు ఎస్టిమేషన్ వర్క్ కూడా  చేయాలని అధికారులకు ఎమ్మెల్యే తెలిపారు.

Read More శ్రీ కురుమూర్తి వెంకటేశ్వర స్వామి ని దర్శించుకున్న డీసీసీబీ డైరెక్టర్ గంప వెంకటేష్ గుప్తా 

WhatsApp Image 2024-07-08 at 3.35.00 PM (1)

అలాగే స్వచ్ఛమైన మంచినీరు ప్రతిరోజూ ప్రజలకు అందించాలని వాటర్ వర్క్స్ బోర్డ్ అధికారులకు ఎమ్మెల్యే  సూచించారు. అలాగే వీధిలో వీధి దీపాలను పరిశీలించి ఎక్కడెక్కడ మరమ్మతులు అవసరమో అక్కడ మరమ్మతులు చేయించి, వీధి దీపాలు లేనిచోట కొత్త వాటిని బిగించాలని అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా బిఆర్ఎస్ నాయకులు బొట్టు శ్రీను తల్లి కి ఆక్సిడెంట్ అయ్యిందని తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి  ఎమ్మెల్యే పరామర్శించారు.

WhatsApp Image 2024-07-08 at 3.34.59 PM

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్  పద్మ వెంకట్ రెడ్డి   AMHO హేమ లత , ఎలక్ట్రిసిటీ ఏఈ సౌమ్య , జిహెచ్ఎంసి డిఈ ప్రవీణ్ , వర్క్ ఇన్స్పెక్టర్ రవి , వాటర్ వర్క్స్ అధికారి మజీద్ , డివిజన్ ప్రెసిడెంట్ చంద్రమోహన్  , బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.