గత ప్రభుత్వంలో నాటిన మొక్కలు మణిహారంగా మారాయి.... ఎమ్మెల్యే గాంధీ

WhatsApp Image 2024-07-09 at 5.52.08 PM

విశ్వంభర కూకట్ పల్లి జులై 9 : వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా మంగళవారం వివేకానంద నగర్ కాలనీలోని వినాయక నగర్ పార్కులో శేర్లింగంపల్లి శాసనసభ్యులు ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, మాధవరం రోజాదేవి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవంలో భాగం కావడం సంతోషకరంగా ఉందని, రోడ్డుకు ఇరువైపులా,  కాలనీలలో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కాలనీ వాసులకు సూచించారు. గత ప్రభుత్వంలో నాటినన్ మొక్కలు ప్రస్తుతం రాష్ట్రానికి మణిహారంగా మారాయి అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు మేనేజర్ రఘువీర్ , మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావు, సంజీవ రెడ్డి, గొట్టిముక్కల పెద్ద భాస్కర్ రావు, మాచర్ల భద్రయ్య, రాంచందర్, ఆంజనేయులు, చంద్రమోహన్ సాగర్, సత్యనారాయణ, రవి, జగదీష్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు....

Read More తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ కార్మిక సంఘం.