ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డు ఇవ్వాలి
- టిడబ్ల్యూజేఎఫ్ అధ్యక్షుడు తడక నర్సింహ
విశ్వంభర, మహేశ్వరం : జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డు ఇవ్వలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉందా అని మహేశ్వరం నియోజకవర్గం టిడబ్ల్యూజేఎఫ్ యూనియన్ అధ్యక్షుడు తడక నర్సింహా అన్నారు. తడక నర్సింహా మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్టుల గుర్తింపు విషయంలో నిర్లక్ష్యం వహిస్తూ జర్నలిస్ట్ సమాజాన్ని అవమానించే విధంగా నిర్ణయాలు తీసుకుంటుందని విమర్శించారు.. రాష్ట్ర ప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్టుల గుర్తింపు విషయంలో నిర్లక్ష్యం వహిస్తూ జర్నలిస్ట్ సమాజాన్ని అవమానించే విధంగా నిర్ణయాలు తీసుకోవడం సరైంది కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 44 వేలకు పైగా అక్రిడిషన్ కార్డులు ఇవ్వనున్నట్లు ప్రకటించినప్పటికీ కేవలం ఎంపానల్మెంట్ కలిగిన కొన్ని పత్రికలకు, ఛానళ్లకు మాత్రమే ఇస్తూ మిగతా పత్రికలకు అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు, గతంలో ఎంపానల్మెంట్ తో సంబంధం లేకుండా ఆర్ఎస్ఐ గుర్తింపు కలిగిన అన్ని పత్రికలకు ఆయా పత్రికల సర్కులేషన్ ఆధారంగా జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇచ్చారని గుర్తు చేశారు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడిచిన అనేక పత్రికలకు ఇంపానల్మెంట్ చేయకుండా జర్నలిస్టులకు అన్యాయం చేస్తున్నారనివాపోయారు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జర్నలిస్టులందరికీ సరైన న్యాయం చేస్తామని నమ్మబలికిన పాలకులు మీడియా అక్రిడిటేషన్ విషయంలో వివక్ష చూపుతూ చిన్న, మధ్య తరహా పత్రికలకు అన్యాయం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు, ప్రభుత్వ వివక్ష కారణంగా స్వరాష్ట్రంలో చిన్న పత్రికల మనుగడ ప్రశ్నార్ధంగా మారుతుందని, దీనివల్ల ఎంతోమంది జర్నలిస్టులకు పత్రికల నిర్వహణ భారమవుతుందన్నారు, రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి ఆర్ఎన్ఐ, పీఆర్ఐ రిజిస్ట్రేషన్ కలిగి ఉన్న పత్రికలకు అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా డెస్క్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల విషయంలో స్పష్టత ఇవ్వాలన్నారు, రేవంత్ రెడ్డి అధికారంలోకి రాక ముందుకు జర్నలిస్టులకు అన్ని హక్కులు సాధించుకునే విధంగా మా ప్రభుత్వం వచ్చిన వెంటనే అమలు చేస్తామని అన్ని రకాలుగా జర్నలిస్టులకు న్యాయం చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు జర్నలిస్టులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.



