చక్రవర్తి హాస్పిటల్ లో పెయిన్ క్లినిక్ ప్రారంభించిన మంత్రి, ఎమ్మెల్యే నాయిని..
5 వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి ఎమ్మెల్యే…
On
విశ్వంభర, హనుమకొండ : పట్టణంలోని బాలసముద్రంలోని చక్రవర్తి దవాఖాన 5 వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట్ర పంచాయతీ రాజ్,స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క), వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన పెయిన్ క్లినిక్ సెంటర్ ముఖ్య అతిథులు ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా వారు మాట్లాడుతూ పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులో ఉండేలా చూడాలని,5 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చక్రవర్తి దవాఖాన యాజమాన్యానికి,సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. వైద్యరంగంతో పాటు సామాజిక సేవ కార్యక్రమాలు చేపడుతున్న హాస్పిటల్ యాజమాన్యం డా.ఎం .తరుణ్ రెడ్డి ని అభినందించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



