వైదేహినగర్ లో మెగా రక్తదాన శిబిరం

వైదేహినగర్ లో మెగా రక్తదాన శిబిరం

  • తలసేమియా రోగుల కోసం ముందుకొచ్చిన స్వచ్ఛంద సంస్థలు

 విశ్వంభర, రంగారెడ్డి: తలసేమియా రోగులకు అవసరమైన రక్తాన్ని అందించేందుకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రంగారెడ్డి జిల్లా సహకారంతో మదర్ తెరిసా చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ శిబిరం శనివారం వైదేహి నగర్ రోడ్ నెంబర్ 3/5లో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు చేపూరి శంకర్ మాట్లాడుతూ, రక్తం సకాలంలో అందకపోవడం వల్ల ప్రతి రోజు వేలాది మంది తలసేమియా రోగులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారు, గర్భిణీ లు, శస్త్రచికిత్సలు చేయించుకునే వారికి రక్తం అత్యంత అవసరమని పేర్కొన్నారు.

Tags: