గ్రాండ్ ఫంక్షన్ హాల్ లో వినాయక మండపాల నిర్వాహకులతో సమావేశం 

గ్రాండ్ ఫంక్షన్ హాల్ లో వినాయక మండపాల నిర్వాహకులతో సమావేశం 

విశ్వంభర, చత్రినాక: - పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రాండ్ ఫంక్షన్ హాల్లో వినాయక మండపాల నిర్వాహకులతో ఛత్రినాక  ఇన్స్పెక్టర్ నాగేంద్ర ప్రసాద్ వర్మ మాట్లాడుతూ గతంలో జరిగిన సంఘటనలను చూసుకొని ప్రస్తుతం లోటు పాట్లు సరిదిద్దుకొని సమయపాలనతో తొందరగా ఈ యొక్క నిమర్జనం కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్వాహకులను కోరారు. ఈ కార్యక్రమానికి 200 మంది నిర్వాహకులు హాజరై తమ తమ సందేహాలను నివృత్తి చేసుకొని సమయపాలన పాటించి తొందరగా తీయడానికి ప్రయత్నం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇన్స్పెక్టర్ నాగేంద్ర ప్రసాద్ వర్మ, చిత్రినాక డిఐ  గోపాల్ రావ్, ఎస్సై త్రిమూర్తులు, ఎస్సై స్వప్న, ఎస్సై అఖిల్ మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

Tags: