ఉప్పల్ నియోజకవర్గంలో చెరువులకు మహార్ధశ
On
- రూ.102 కోట్లతో సుందరీకరణ, అభివృద్ధి పనులు
- నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జీ పరమేశ్వర్‌రెడ్డి
విశ్వంభర, ఉప్పల్: ఉప్పల్ నియోజకవర్గంలోని చెరువులను 102 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నట్టుగా ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జీ మందుముల పరమేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. చెరువుల అభివృద్ధితో పాటు సుందరీకరణ పనులను కూడా చేపడుతున్నట్టుగా తెలిపారు. మందుముల పరమేశ్వర్ రెడ్డి ఆహ్వానం మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ నాచారం(హెచ్ఎంటీనగర్) చెరువును సందర్శించారు. నాచారం చెరువులో త్వరలోనే అభివృద్ధి, సుందరీకరణ పనులను చేపట్టనున్నట్టుగా ఈ సందర్భంగా రంగనాథ్ తెలిపారు.30 కోట్ల నిధులతో త్వరలోనే పనులు జరుగుతాయన్నారు. ఉప్పల్ నియోజకవర్గంలోని అన్ని చెరువుల అభివృద్ధి, సుందరీకరణకు కృషి చేస్తున్నట్టుగా ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జీ మందుముల పరమేశ్వర్‌రెడ్డి తెలిపారు. నియోజకవర్గంలో మొదటి విడతలో నాలుగు చెరువుల అభివృద్ధి, సుందరీకరణ పనులకు నిధులు సైతం మంజూరు చేయించినట్టుగా చెప్పారు. ఉప్పల్ నల్ల చెరువు రూ.20 కోట్లు, నాచారం(హెచ్ఎంటీనగర్) చెరువు రూ.30 కోట్లు, కాప్రా చెరువు రూ.35 కోట్లు, రామంతాపూర్ పెద్ద చెరువు రూ.17 కోట్ల చొప్పున నిధులొచ్చినట్టుగా తెలిపారు. ఇప్పటికే ఉప్పల్ నల్లచెరువులో పనులను చేపట్టి తుది దశలో ఉన్నాయన్నారు. అతిత్వరలోనే నాచారం. మిగతా చెరువులలో పనులను చేపట్టనున్నట్టుగా చెప్పారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఎం టీ కాలనీ ప్రధాన కార్యదర్శి రామకోటేశ్వరరావు ,రవీందర్ రెడ్డి సీనియర్ కాంగ్రెస్ నాయకులు కృష్ణారెడ్డి, హెచ్‌ఆర్ మోహన్ ప్రకాష్ రెడ్డి ,అశ్వద్ధామ రెడ్డి ,,భావన గౌడ్,మహేష్ యాదవ్, రమేష్ గౌడ్,నూతలకంటి రాజు, సంతోష్ రెడ్డి, రాజి రెడ్డి, కృష్ణ యాదవ్, వెంకట్ రెడ్డి, వెంకట్ గౌడ్, తుంగ తిరుపతి, సూర్య యాదవ్, కేయూం జకీమ్, అబ్రహం,చిలకనగర్ డివిజన్ కాంగ్రెస్ నాయకులు చెన్ రెడ్డి రఘుపతి రెడ్డి,బజాజ్ జగన్ గౌడ్ ,ఆకి మంటి ఆగం రెడ్డి, చిలకనగర్ డివిజన్ అధ్యక్షులు ముల్కాపల్లి రాజేష్ ముదిరాజ్,కొంపల్లి బాలరాజ్ ,ముదిరాజ్, నల్లవెల్లి మహేందర్ ముదిరాజ్ ,బొట్టు రాజేష్ ,పల్లె రమేష్ గౌడ్, మంచాల రఘు ,రాధాకృష్ణ , శంకర్ ,గణేష్, కిరణ్ ,జగదీష్ ముదిరాజ్ ,తిరుపాటి జంగయ్య ,శ్రీరాములు, శ్రావణ్ ,డేవిడ్ ,రాము గౌడ్, అమరేశ్వరి ,సుశీలమ్మ ,గీత, సమత, సంతోష్, వంశీ, తదితరులు పాల్గొన్నారు.



