జోరుగా బీఆర్ఎస్ ప్రచారం 

జోరుగా బీఆర్ఎస్ ప్రచారం 

విశ్వంభర, మహబూబాబాద్ : కాలనీలో ఉన్న సమస్యలన్నీ తన  సొంత డబ్బులు  ఖర్చుపెట్టి వార్డుని సుందరవందంగా అభివృద్ధి చేసి చూపిస్తానని  24 వ వార్డు బిఆర్ఎస్ పార్టీ  కౌన్సిలర్  అభ్యర్థి గా పోటీ చేస్తున్న వెన్నమల్ల అజయ్  చెప్పారు. తనని  భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. 24వ వార్డు లోని  పలు కాలనీలలో ఆయన  ప్రచారం నిర్వహించారు . ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ,  ఇంతకు  ముందు కూడా నేను వార్డు కౌన్సిలర్ గా  పోటీ చేసి ఈ వార్డు పరిధిలోని పలు కాలనీలలో  చాలా  అభివృద్ధి పనులు చేశానని తెలిపారు. ఇప్పుడు  బిఆర్ఎస్ పార్టీ  కారు  గుర్తుపై  ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు పాల్గొన్నారు .

Tags: