సీఎం రేవంత్‌తో భట్టి విక్రమార్క భేటీ

సీఎం రేవంత్‌తో భట్టి విక్రమార్క భేటీ

 మున్సిపల్ ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రచార వ్యూహాలకు మరింత పదును పెడుతోంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రత్యేకంగా భేటీ అయ్యారు. 

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రచార వ్యూహాలకు మరింత పదును పెడుతోంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దాదాపు గంటకు పైగా జరిగిన ఈ సమావేశంలో ఎన్నికల వ్యూహాలు, అభ్యర్థుల సమన్వయం, పార్టీ అంతర్గత అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. ఇటీవల మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన కీలక సమావేశానికి భట్టి విక్రమార్క హాజరుకాకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఆ గైర్హాజరీపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో, నేడు వీరిద్దరూ వ్యక్తిగతంగా భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.