మున్సిపల్ ఎన్నికల సిబ్బందికి శిక్షణ
విశ్వంభర, మహబూబాబాద్: శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మున్సిపల్ ఎన్నికల మైక్రో అబ్జర్వర్, పిఓలు, ఏపీవోలకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ ఎన్నికల జనరల్ అబ్జర్వర్ శ్యామ్ ప్రసాద్ లాల్ హాజరై ఎన్నికల నిర్వహణలో తీసుకోవలసిన జాగ్రత్తలు, విధులపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో ఐదు మున్సిపల్ పరిధి ల్లో జరిగే ఎన్నికల నిర్వహణలో ప్రతి ఒక్క ఉద్యోగి పక్కాగా ఎన్నికల సంఘం కమిషన్ సూచించిన నిబంధనల ప్రకారం నడుచుకోవాలని, ప్రతి ప్రశ్నకు ఎన్నికల బుక్ లో సమాధానాలు ఉంటాయని తెలిపారు. ఎలాంటి సందేహాలు వచ్చిన మాస్టర్ ట్రైనర్స్, పై అధికారులను వెంటనే సంప్రదించాలని సూచించారు. ప్రతి ఉద్యోగి సమన్వయంతో కలిసి పనిచేసి ఎన్నికలు విజయవంతంగా నిర్వహించాలని ఆయన కోరారు,
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ కె. అనిల్ కుమార్, మాస్టర్ ట్రైనర్స్ రాములు, ప్రవీణ్, దాశరధి శ్రీధర్, కృష్ణవేణి, తదితరులు పాల్గొన్నారు.



