ఆశీర్వదించండి.. అభివృద్ధి చేస్తా
- 10వ వార్డు అభ్యర్థి ఉప్పునూతల సంధ్యా రమేష్
విశ్వంభర,కేసముద్రం : కేసముద్రం స్టేషన్ మున్సిపాలిటీ ఎన్నికల్లో తనను ఓటర్లు ఆశీర్వదించి గెలిపిస్తే వార్డును అన్ని రంగాలలో ఆదర్శంగా తీర్చిదిద్దుతానని 10వ వార్డు బీజేపీ అభ్యర్థి ఉప్పునూతల సంధ్యా రమేష్ పేర్కొన్నారు. బలహీన వర్గానికి చెందిన దినసరి కూలీ అయిన నాకు బీజేపీ అవకాశాన్ని కల్పించిందని, ఇది కేవలం బీజేపీలోనే సాధ్యమని అన్నారు. ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను కలుస్తూ మీ అమూల్యమైన ఓటు కమలం పువ్వు గుర్తుపై వేసి తనను గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. కౌన్సిలర్ గా గెలిపిస్తే వార్డు అభివృద్ధి కోసం కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్, జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్, సహకారంతో అధిక నిధులు తీసుకువచ్చి మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈనెల 11న జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఉప్పునూతల సంధ్యా రమేష్ ఓటర్లను కోరారు.ప్రచార కార్యక్రమలో బిజేపి జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోత్ మధన్ నాయక్, మండల అధ్యక్షుడు ఉప్పునూతల రమేష్, ఎస్టి మోర్చా జిల్లా నాయకులు బాదావత్ సురేష్, జాటోత్ సురేష్, వరుణ్, భూక్య బాలు, తదితరులు పాల్గొన్నారు.



