ఘనంగా V3 న్యూస్ విశ్వంభర దినపత్రిక నూతన క్యాలెండర్ ఆవిష్కరణ..

ఘనంగా V3 న్యూస్ విశ్వంభర దినపత్రిక నూతన క్యాలెండర్ ఆవిష్కరణ..

విశ్వంభర,సంస్థాన్ నారాయణపురం: యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో స్థానిక సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి ఆధ్వర్యంలో v3న్యూస్, విశ్వంభర దినపత్రిక క్యాలెండర్ ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ... నిజాలను నిర్భయంగా వెలుకితీస్తూ సమాజంలో జరిగే అవినీతి అన్యాయాలపై వార్తలు రాస్తూ పత్రిక రంగంలో తమదైన శైలితో ప్రత్యేక గుర్తింపును v3 న్యూస్, విశ్వంభర దినపత్రిక సంపాదించుకుందని అన్నారు. రాబోయే రోజుల్లో మరింత ప్రజాదారణ  పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పల్లా మల్లారెడ్డి, బిజెపి జిల్లా నాయకులు వంగరి రఘు, వార్డ్ సభ్యులు సూరపల్లి వెంకటేష్,చింతల శైలజ సత్యనారాయణ,నీళ్ల అనిత, సబవత్ రఘు, నాయకులు చిలివేరు శంకర్, బద్దుల మురళి, గడ్డం యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Tags: