వ్యవసాయ అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన 

వ్యవసాయ అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన 

విశ్వాంభర, పెద్ద శంకరంపేట:  జాతీయ ఆహార భద్రతా పథకం కింద  వేసిన జొన్న పంటలను క్షేత్రస్థాయిలో శుక్రవారం వ్యవసాయ అధికారులు పరిశీలించారు. పెద్ద శంకరంపేట్ మండలంలో మూసాపేట్ క్లస్టర్ లో మక్త లక్ష్మాపూర్ గ్రామంలో జాతీయ ఆహార భద్రత, పోషకాహార పథకము కింద రైతులకు సబ్సిడీపై ఇచ్చిన జొన్న పంటలను క్షేత్రస్థాయి పరిశీలన చేయడం జరిగిందని మండల వ్యవసాయ అధికారి కృష్ణ తెలిపారు.. దీనిలో భాగంగా రైతులు పండిస్తున్న జొన్న పంటలు ఆరోగ్యంగా ఉన్నాయా  లేదా అని పరిశీలించడం జరిగిందన్నారు.  రైతులు ఎలాంటి ఎరువులు వాడారు, చీడపీడలు  తెగులు పై ఎలాంటి ఎరువులు మందులు వాడాలో రైతులకు అవగాహన కల్పించడం జరిగిందని అన్నారు.  ఈ కార్యక్రమంలో ఏఈవోలు అఖిల్ వినీత్,  మండల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.

Tags: