ఇస్నాపూర్ లో కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం
విశ్వంభర, సంగారెడ్డి : పటాన్‌చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇంటింటి ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించారు. 12వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి గడ్డం శ్రీశైలం,14వ వార్డు అభ్యర్థి గడ్డం బాలమణి శ్రీశైలం నాయకత్వంలో కాలనీల్లో తిరుగుతూ ప్రజలను కలుసుకుని కాంగ్రెస్ పార్టీకి మద్దతు కోరారు.ఈ సందర్భంగా అభ్యర్థులు మాట్లాడుతూ, గతంలో బీఆర్‌ఎస్ పార్టీ పాలన సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి సర్పంచ్‌గా పనిచేసినప్పుడు అనేక అభివృద్ధి పనులను విజయవంతంగా చేపట్టామని గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో, ఇస్నాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో 11 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసి చైర్మన్ పదవిని కైవసం చేసుకుంటే మరింత వేగంగా అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసి మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో ముందంజలో నిలుపుతామని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారం, మౌలిక వసతుల కల్పన, పారిశుద్ధ్యం, తాగునీరు, రోడ్ల అభివృద్ధి వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు ఉన్న విశ్వాసంతో ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని వారు ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, స్థానిక నాయకులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



