బిఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నాయకులు
On
విశ్వంభర, సంగారెడ్డి: పటాన్ చెరు మున్సిపల్ ఎన్నికల వేళ పటాన్ చేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, మాజీ ఎంపీపీలు దేవానందం, యాదగిరి యాదవ్, వెంకట్ రెడ్డి, దశరథ్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, అమీన్పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్ లతో పాటు కార్యకర్తలు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు సమక్షంలో బి ఆర్ ఎస్ పార్టీలో చేరారు. హరీష్ రావు పార్టీ కండువా కప్పి సాదర స్వాగతం పలికారు. కేసీఆర్ నాయకత్వంలో పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని ఐదు మున్సిపాలిటీలను బిఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేస్తుందని ఆయన ఆశాభవం వ్యక్తం చేశారు.



