5వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాట్రోత్ సుగుణ జోరుగా ప్రచారం
విశ్వంభర, చండూర్:- సిపిఐ పార్టీ బలపరిచిన 5వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాట్రోత్ సుగుణ మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ప్రచార కార్యక్రమంలో భాగంగా 5వ వార్డు లో ఇంటింటికి వెళ్లి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నానని ప్రతి ఒక్కరూ చెయ్యి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థి కాట్రోత్ సుగుణ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాపై నమ్మకం ఉంచి నన్ను 5వ వార్డు నుండి సిపిఐ పార్టీ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అవకాశం దక్కినందుకు చాలా సంతోషపడుతున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన పేరిట ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు సంక్షేమ పథకాలు అందిస్తుందని, ఆ సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి చేరువయ్యాయని, ఆ ప్రజాపాలన వచ్చిన తరవాత ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్కటి నెరవేరుస్తూ వస్తుందని అన్నారు. తెలంగాణ అభివృద్ధి మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి అలాగే చండూరు మున్సిపాలిటీ అభివృద్ధి మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశీస్సులతో ఆశీర్వాదాలతో ముందుకు సాగుతూ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందనీ అన్నారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల్లో చండూరు పురపాలకలో కాంగ్రెస్ పార్టీ పీఠం కైవసం చేసుకోబోతుందని, పది వార్డులకు సంబంధించిన అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుస్తున్నారని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తల తదితరులు పాల్గొన్నారు



