తపస్ క్యాలెండర్ ఆవిష్కరణ
On
విశ్వంభర, రామన్నపేట: తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రామన్నపేట మండల శాఖ ఆధ్వర్యంలో నూతన క్యాలెండర్ ను యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలోని మండల వనరుల కేంద్రం ఆవరణలో మండల విద్యాధికారిణి గవ్వ జ్యోతి, తపస్ జిల్లా ఉపాధ్యక్షుడు సప్పిడి సీనారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా సీనారెడ్డి మాట్లాడుతూ, ఎస్జీటి పోస్టుల రద్దును వెనక్కి తీసుకోవాలని, పీఆర్సీ ని ప్రకటించాలని, పెండింగు బిల్లులను మంజూరు చేయాలని, 2016 వేసవి సెలవుల్లో మధ్యాహ్న భోజన విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు సంపాదిత సెలవులు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి నవీన్ కుమార్, వసంతా దేవి, విజయ, వనం అంజయ్య తదితరులు పాల్గొన్నారు.



