ఇంద్రేశంలో బీఆర్‌ఎస్ ఇంటింటి ప్రచారం
విశ్వంభర, సంగారెడ్డి : పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని ఇంద్రేశం మున్సిపాలిటీ 4వ వార్డులో బీఆర్‌ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి దండు స్రవంతి నర్సింలు విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గడపగడపకు వెళ్లి స్థానిక ప్రజలను కలుసుకుంటూ బీఆర్‌ఎస్ పార్టీ హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను వివరించారు. గత పాలనలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చిందని ఆమె పేర్కొన్నారు.పార్టీపై ప్రజల్లో మంచి ఆదరణ ఉందని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తమకు సంపూర్ణ మద్దతు లభిస్తుందని దండు స్రవంతి ధీమా వ్యక్తం చేశారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా బీఆర్‌ఎస్ పార్టీ నిరంతరం పనిచేస్తోందని తెలిపారు. తమ అమూల్యమైన ఓటును కారు గుర్తుకు వేసి గెలిపించాలని కోరారు. ఇంద్రేశం మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్ పార్టీ జెండాను ఎగరవేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.



