బాధిత కుటుంబానికి ఆర్ధిక సాయం     

బాధిత కుటుంబానికి ఆర్ధిక సాయం     

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, పల్లివాడ గ్రామంలో ఇటీవల మరణించిన గట్టు మల్లమ్మ కుటుంబ సభ్యులకు సిపిఎం గ్రామ శాఖ తరుపున 50కిలోల బియ్యం, 5కిలోల నూనె, అలాగే వెయ్యి  రూపాయలు ఆర్ధిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ కార్యదర్శి, ఉప-సర్పంచ్ పావిరాల మత్స్యగిరి, మాజీ వార్డు మెంబర్ బైకాని నరసింహ, మాజీ వార్డు సభ్యులు గట్టు నరసింహ, ప్రస్తుత వార్డు మెంబర్ గట్టు ఉపేందర్, శాఖ సభ్యులు జనపాల రాములు, మేకల నరసింహ, మేడి మహేష్ పాల్గొన్నారు.

Tags: